Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మునగ ఆకులతో ఇంత ఆరోగ్యమా... అస్సలు మిస్‌ కావొద్దు!

health benefits of eating fresh moringa leaves
Advertisement
  • ఎన్నో రకాల పోషకాలకు మునగ ఆకులు నిలయం
  • బరువు తగ్గడం నుంచి మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా...!
  • తరచూ మునగ ఆకులను తీసుకుంటే దీర్ఘకాలిక వ్యాధులకు దూరం
Advertisement
సాంబార్‌ లో ములక్కాడలు ఉంటే ఆ రుచే వేరు. చాలా మంది ఇష్టంగా లాగించేస్తుంటారు. కొందరు మునగ చెట్టు ఆకులను కర్రీలో వినియోగిస్తుంటారు కూడా. కానీ మునగ ఆకుల ప్రయోజనం తెలిస్తే మాత్రం అందరూ వాటి వినియోగాన్ని మొదలుపెట్టడం ఖాయమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మునగ ఆకులతో ఉండే ప్రయోజనాలను వివరిస్తున్నారు.

బరువు తగ్గేందుకు తోడ్పాటు...
మునగ ఆకులు శరీరంలో కొవ్వు కణాల నియంత్రణకు తోడ్పడుతున్నట్టు ఇటీవల శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతేకాదు మునగ ఆకులు ఆకలిని కూడా తగ్గిస్తాయని తేల్చారు. అంటే బరువు తగ్గాలనుకునే వారికి మునగ మంచి చాయిస్‌ అని చెప్పొచ్చు.

ఎముకలు దృఢంగా ఉండేందుకు...
మునగ ఆకుల్లో కాల్షియం, ఫాస్పరస్‌ ఖనిజాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మన ఎముకలు, దంతాలు బలంగా ఉండేందుకు తోడ్పడుతాయి. తరచూ మునగ ఆకులను తీసుకునేవారు వృద్ధాప్యంలో ఎముకలు బలహీనపడే ‘ఆస్టియో పోరోసిస్‌’ సమస్య నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

రోగ నిరోధక వ్యవస్థ బలోపేతానికి...
తాజా మునగ ఆకుల్లో విటమిన్‌ సి అధికంగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌ గా పనిచేస్తుంది. మన శరీరం వైరస్‌ లు, బ్యాక్టీరియాలతో పోరాడేందుకు తోడ్పడుతుంది. జలుబు, ఇతర ఇన్ఫెక‌్షన్ల నుంచి కాపాడుతుంది.

గుండె ఆరోగ్యానికీ మంచిది
మునగ ఆకుల్లో ఉండే కొన్ని రసాయన సమ్మేళనాలు మన శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయులు, రక్తపోటు తక్కువగా ఉండటానికి తోడ్పడతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. తద్వారా గుండె ఆరోగ్యానికి మునగ అండగా ఉంటుందని చెబుతున్నారు.

షుగర్‌ స్థాయులు కూడా నియంత్రణలో... 
అప్పుడప్పుడూ మునగ ఆకుల రసం తీసుకుంటూ ఉంటే రక్తంలో గ్లూకోజ్‌ స్థాయులు తగ్గుతున్నట్టుగా శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించారు. ముఖ్యంగా మధుమేహంతో బాధపడుతున్నవారికి మునగతో ఎంతో మేలు అని చెబుతున్నారు.

మెదడు పనితీరు మెరుగుపరుస్తుంది
తాజా మునగ ఆకుల్లో సి, ఇ విటమిన్లు రెండూ ఉంటాయి. ఇవి మెదడు పనితీరు మెరుగుపడటానికి తోడ్పడతాయి. జ్ఞాపక శక్తి తగ్గిపోకుండా కాపాడతాయి. ఒత్తిడిని తగ్గించి ఏకాగ్రతను పెంచేందుకు వీలు కల్పిస్తాయి.

కాలేయం ఆరోగ్యం కోసం...
మునగ ఆకుల్లో ఉండే కొన్ని రసాయన సమ్మేళనాలు, ఇ, సి విటమిన్లు శరీరంలో నుంచి విష/వ్యర్థ పదార్థాలను బయటికి పంపేస్తాయి. ఇది అంతిమంగా మన కాలేయంపై ఒత్తిడి తగ్గించి, అది ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుంది.

ఎన్నో రకాల పోషకాలతో ప్రయోజనం
మునగ ఆకుల్లో ఏ, సి, ఇ విటమిన్లు, కాల్షియం, పొటాషియం, ఐరన్‌ వంటి కీలక ఖనిజాలు ఉంటాయి. మన శరీరానికి అవసరమైన పోషకాలలో కొంతమేర మునగ ఆకుల ద్వారా సమకూరుతుంది. మొత్తం ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
Advertisement
Advertisement
Moringa
Health
offbeat
Science
Diabetes

More Telugu News